ETV Bharat / city

ఈ వీడియో అందరూ చూడండి - ktr tweet on sanitation

పారిశుద్ధ్య కార్మికులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారంటూ ఓ విద్యార్థి తన పాఠశాలలో చెప్పిన కవితకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తన ట్విటర్‌లో ఉంచారు. ఈ వీడియోను తిలకించిన మంత్రి కేటీఆర్...​ పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత.. వ్యర్థాలను వేరు చేస్తున్న కార్మికులకు సాయం చేద్దాం.. శ్రమ గౌరవాన్ని గుర్తించాలంటూ ట్విట్​ చేశారు. రతన్‌టాటా తమ ట్విటర్‌లో ఉంచిన వీడియోను అందరూ తిలకించాలని కోరారు.

it minister ktr
కేటీఆర్​ ట్విట్టర్​
author img

By

Published : Feb 19, 2020, 7:57 AM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను చాటారు. పారిశుద్ధ్య కార్మికులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారంటూ ఓ విద్యార్థి తన పాఠశాలలో చెప్పిన కవితకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో ఉంచారు. ఈ వీడియోను జత చేస్తూ రతన్‌ టాటా పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులను వివరిస్తూ వారిపై భారం తగ్గించేందుకు తాము చేస్తున్న కృషిని వివరించారు.

ముంబయిలో ప్రతిరోజూ 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. మిషన్‌ గరిమ ద్వారా కష్టపడి పనిచేసే వారిపై భారం తగ్గించడం, సురక్షితం పరిశుభ్రమైన, మానవీయ వాతావరణాన్ని కల్పించడానికి ‘టూబిన్స్‌ లైఫ్‌ విన్స్‌’ నినాదంతో టాటా ట్రస్టు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఈ వీడియోను తిలకించిన మంత్రి కేటీఆర్...​ పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత.. వ్యర్థాలను వేరు చేస్తున్న కార్మికులకు సాయం చేద్దాం... తడి, పొడి చెత్తను వేరు చేయాలి.... శ్రమ గౌరవాన్ని గుర్తించాలంటూ ట్వీట్​ చేశారు. ముంబయిలోని పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా తమ ట్విటర్‌లో ఉంచిన వీడియోను అందరూ తిలకించాలి అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

it minister ktr
కేటీఆర్​ ట్విట్టర్​

రతన్‌టాటా జత చేసిన వీడియో సారాంశం

నా తండ్రి దేశాన్ని నడిపిస్తాడు..

ఆయన నాయకుడు కాదు.. అయినా దేశాన్ని దౌడు తీయిస్తాడు

ఆయన వైద్యుడు కాదు.. అయినా వ్యాధులను దూరం చేస్తాడు

ఆయన పోలీసు కాదు.. అయినా చెడును అడ్డుకుంటాడు

ఆయన సైనికుడు కాదు.. అయినా దేశంలోని దుష్ట శక్తులను పారదోలుతాడు

నా తండ్రి పనికి పోకపోతే.. దేశంలోని ఏ ఇల్లు సరిగా నడవదు

వంట కూడా వండుకోరు.. స్నానాలూ చేయరు

వీధుల్లో క్రిమికీటకాలు రాజ్యమేలుతాయి.. పిల్లలైతే పాఠశాలలకే వెళ్లరు

ఆసుపత్రుల్లో వైద్యులుండరు.. మంత్రులు పార్లమెంటుకు చేరుకోలేరు

మొత్తం దేశం స్తంభించిపోతుంది..

నా తండ్రి దేశ జీవనాన్ని సులభం చేస్తాడు

నా తండ్రి మాదిరి పనిని ఏఒక్కరూ చేయాలనుకోరు

తడి, పొడి చెత్తను దేశంలో ఎవరూ వేరు చేయడం లేదు

నా తండ్రి మురుగునీటిలో మునిగి చెత్తను బయటికి తీస్తున్నాడు

ఆయన పని నుంచి బయటికి వచ్చినప్పుడు తరచూ

జబ్బు పడినట్లు కనిపిస్తాడు

కొన్నిసార్లు ఆయన ఈ జబ్బులతో చనిపోతారనుకుంటాను

కొన్నిసార్లు ఆయన మళ్లీ ఇంటికి రారనుకుంటాను

దేశాన్ని నా తండ్రి ఒంటరిగా నడిపే పరిస్థితి వద్దు

ఎందుకంటే దేశం మనలోని ప్రతి ఒక్కరితో నడుస్తోంది.

  • In Mumbai, only 50,000 sanitation workers are working in difficult conditions every day. As a @tatatrusts initiative, Mission Garima is working to provide safe, hygienic and humane working conditions for them via #TwoBinsLifeWins to reduce the burden on these hardworking workers. pic.twitter.com/Wkd2Mouj48

    — Ratan N. Tata (@RNTata2000) February 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.