ETV Bharat / city

KTR Tweet Today : కేటీఆర్‌కు పర్యావరణవేత్త ట్వీట్.. మంత్రి రియాక్షన్ అదుర్స్ - హెచ్‌జీసీలో సైక్లింగ్ ట్రాక్‌

KTR Tweet Today : ట్విటర్ ద్వారా ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే రాష్ట్ర మంత్రి కేటీఆర్.. ఆ వేదికగా వారి సమస్యలు తెలుసుకుంటారు. కేవలం వారి సమస్యలు పరిష్కరించడమే గాక.. ఎవరైనా ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటారు. వారి సూచనలు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడతాయనుకుంటే ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. అలా ఓ పర్యావరణవేత్త కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చిన ఓ అంశం మంత్రిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే..

KTR Tweet Today
KTR Tweet Today
author img

By

Published : Mar 5, 2022, 8:25 AM IST

KTR about Cycling path in Hyderabad : దక్షిణ కొరియాలో ఓ జాతీయ రహదారి మధ్యలో సైకిల్‌ట్రాక్‌ ఏర్పాటు చేసి దానిపై సోలార్‌ కప్పును అమర్చారని, దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ఎండ నుంచి రక్షణ పొందుతూ సైక్లిస్టులు ముందుకు సాగుతున్నారని, ఇది పర్యావరణహితంగానూ ఉందని పేర్కొంటూ ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్‌ సొల్‌హైమ్‌ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయగా ఆయన స్పందించారు. తాము కూడా దీనిని చేపడతామని తెలియజేస్తూ ఆయన పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌కు ఈ పోస్టును ట్యాగ్‌ చేశారు. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌లో ప్రతిపాదించిన సైక్లింగ్‌ ట్రాక్‌ను 21 కిలోమీటర్ల మేర ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

షేన్‌వార్న్‌ మృతిపై మంత్రి కేటీఆర్‌ సంతాపం

KTR Tweet Today : షేన్‌వార్న్‌ మృతిపై మంత్రి కేటీ రామారావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్‌ అని, గొప్ప లెగ్‌ స్పిన్నర్‌లలో ఒకరని తెలిపారు. క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సైతం షేన్‌ వార్న్‌ మృతిపై సంతాపం వ్యక్తంచేశారు. క్రికెట్‌ రంగానికి ఇది తీరని లోటన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.