అణగారిన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి అంబేడ్కర్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో హామీ ఇచ్చినట్లుగానే.. దేశంలోకెల్లా అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున త్వరలో ప్రతిష్టించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రి ఈశ్వర్ సమక్షంలో ఒప్పందం జరిగినట్లు పేర్కొన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాగం ద్వారానే స్వరాష్ట్రం సిద్ధించిందని.. ఆయన సూచించిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఇవీచూడండి: బాబాసాహెబ్‌కు మోదీ, రాహుల్ నివాళి