రాష్ట్ర పోలీస్ శాఖపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
తన స్నేహితుని భార్యకు ఏం జరిగిందంటే..
ఒకప్పుడు నగరంలో గొడవలు, కర్ఫ్యూలు జరిగేవన్న మంత్రి కేటీఆర్.. ఆరున్నరేళ్లలో రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. 2014లో సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలే ఈ మార్పులకు ప్రధాన కారణమని వెల్లడించారు. గత ఆరేళ్లలో రాష్ట్ర పోలీసుల పనితీరు అద్భుతమని ప్రశంసించారు. శాంతిభద్రతలు, రక్షణ విషయంలో నగరానికి మంచి పేరు తెచ్చారని కొనియాడారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో పోలీసుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. గతంలో తన స్నేహితుని భార్య ఫిర్యాదుపై షీం టీం స్పందించిన తీరును వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే.. రూ.284 కోట్లతో అత్యాధునిక పోలీస్ వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. సాధారణ నేరాలు తగ్గుతున్నాయని, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. సైబర్ నేరాల నివారణలో మరింత మెరుగవ్వాలని కోరుతున్నానన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం కావాలంటే శాంత్రి భద్రతలు ఎంతో ముఖ్యం. ఎంత గొప్ప పాలసీలు తీసుకువచ్చినా శాంతి భద్రతలు సవ్యంగా లేకపోతే పెట్టుబడులు రావు. తెలంగాణ పోలీస్‌శాఖ పనితీరుతో చూద్దామన్న చిన్న సమస్యలూ లేవు. నేరాలు తగ్గుముఖం పట్టాయని గణాంకాలు చెబుతున్నాయి. వివక్ష, ప్రాంతీయ ద్వేషాలు, విభేదాలు లేవు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాల అధ్యయనానికి ఆరుగురు సభ్యుల బృందం స్కాట్లాండ్, లండన్, లాస్‌ఎంజెల్స్‌లో పర్యటించింది.
- కేటీఆర్
ఇవీచూడండి: కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్