దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావడేకర్‌తో భేటీ అయ్యారు. వరంగల్‌లో నిర్మిస్తున్న కాకతీయ మెగా జౌళిపార్క్కు ఆర్థిక సాయం చేయాలంటూ ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి వినతిపత్రం అందించారు. జౌళి పార్కును ప్రపంచ వస్త్ర ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రికి తెలిపారు. సీపీసీఎస్డీ పథకం కింద సిరిసిల్లలోని మెగా పవర్లూమ్ క్లస్టర్‌కు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లోని ఫార్మా సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను కోరారు. ఫార్మా సిటీ సంబంధించిన అనుమతులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.
ఇవీచూడండి: సవాళ్లను అధిగమించి సుపరిపాలన అందిస్తున్నాం: కేటీఆర్