KTR on Bjp Government: చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. మునుగోడు నియోజకవర్గంలోని చేనేత కార్మికులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చేనేత, టెక్స్‌టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న భాజపాకు మునుగోడు నేతన్నలు గట్టిగా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులకు గుర్తింపు, గౌరవం లభించిందని పేర్కొన్నారు.
'చేనేత కార్మికులు ఉపఎన్నికల్లో ఓటుతో భాజపాకు బుద్ధి చెప్పాలి. చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ. చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. పొదుపు, బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసింది. నేతన్నల భవిష్యత్తును భాజపా అగమ్యగోచరంగా మారుస్తున్నది. తెరాస ప్రభుత్వం భారీగా బడ్జెట్ ఇచ్చి నేతన్నలను ఆదుకుంటోంది.'-కేటీఆర్, పురపాలకశాఖ మంత్రి
ఇవీ చదవండి: