రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులను చేపట్టవద్దని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు.. ఏపీకి ఈమేరకు లేఖ రాసింది.
ఎన్జీటీ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుల పనులు కొనసాగిస్తోందంటూ తెలంగాణ ఈఎన్సీ డిసెంబర్ 19న బోర్డుకు లేఖ రాశారు. స్పందించిన బోర్డు సభ్యకార్యదర్శి హరికేశ్ మీనా.. ఏపీ ఈఎన్సీకి లేఖ రాశారు.
ఆమోదం లేని ప్రాజెక్టుల పనులు చేపట్టవద్దని గతంలోనే స్పష్టం చేశామని... అయినప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు కొనసాగిస్తున్నారని తెలంగాణ ఫిర్యాదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. డీపీఆర్లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలించకుండా... ప్రాజెక్టులకు అత్యున్నత మండలి ఆమోదం లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని లేఖలో సూచించింది.
ఇవీచూడండి: వెనకబాటు అధిగమించి.. ఆదర్శ రాష్టంగా నిలిచింది: గవర్నర్