వేతనాలు సహా చేపట్టాల్సిన పనులు, ఇతర అవసరాల కోసం నిధులు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వేతనాలు, నిర్వహణ, రెండో దశ టెలీమెట్రీ, టూడీ నమూనా అధ్యయనం, ఏపీకీ బోర్డు తరలింపు, తదితరాల కోసం రూ.18 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసింది. అందుకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల వాటాగా తొమ్మిది కోట్లలో మొదటి, రెండో త్రైమాసికం నిధులు విడుదల చేయాలని కోరింది.
ప్రస్తుతం బోర్డు వద్ద కేవలం రూ.2.9 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. వేతనాలు సహా నిర్వహణ కోసం ఇవి నాలుగు నెలలకు కూడా సరిపోవని తెలిపింది. నిధులు లేక రెండో దశ టెలీమెట్రీ, టూడీ నమూనా అధ్యయనం తదితర పనులు చేపట్టడం లేదని బోర్డు పేర్కొంది. నిధుల విడుదలలో ఆలస్యమయితే వేతనాల చెల్లింపు, రోజువారి నిర్వహణ ఇబ్బందికరం అవుతుందని కేఆర్ఎంబీ తెలిపింది.
ఇదీచూడండి: HEAVY RAIN: హైదరాబాద్లో పలు చోట్ల ఏకధాటిగా కురిసిన వర్షం