శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు కోరింది. జరిగిన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బోర్డు... తొమ్మిది మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపింది.
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని, అందుకోసం తక్షణమే నివేదిక పంపాలని బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు మౌంతాంగ్.. జెన్కో సంచాలకులకు లేఖ రాశారు.
ఇవీ చూడండి: 'శ్రీశైలం మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం'