ETV Bharat / city

'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు'

author img

By

Published : Aug 7, 2019, 4:47 PM IST

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చేనేత ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆచార్య కోదండరాం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు'

చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాలు పాటించకపోవడం వల్లనే కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో... బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములుతో కలిసి పాల్గొన్నారు. నారాయణగూడలోని పద్మశాలి భవన్ ముందున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చేనేత వృత్తిపై 50 వేల మంది ఆధారపడి జీవిస్తుండగా... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 300 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: వర్షపు నీటిబ్యాంకులతో ఈ గ్రామం సస్యశ్యామలం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.