ETV Bharat / city

ప్రియాంకగాంధీతో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ, ఆ విషయాలపై చర్చ - ప్రియాంక గాంధీ తాజా వార్తలు

Komatireddy met Priyanka Gandhi కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీతో సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్ర నేతలు ప్రియాంక గాంధీతో భేటీ కాగా కోమటిరెడ్డి హాజరుకాలేదు. తాజాగా జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు.

komatireddy
komatireddy
author img

By

Published : Aug 24, 2022, 10:21 PM IST

Updated : Aug 24, 2022, 10:54 PM IST

Komatireddy met Priyanka Gandhi: ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఏఐసీసీ సెక్రటరీ ప్రియాంక గాంధీతో సమావేశం అవ్వగా... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ నైపథ్యంలో... నేడు ప్రియాంక గాంధీతో వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించామని వెంకట్​రెడ్డి తెలిపారు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన భేటీలో పార్టీకి సంబంధించిన చాలా విషయాలపై చర్చించామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ను పటిష్ఠం చేసేందుకు ప్రియాంక గాంధీ పలు సూచనలు చేశారని తెలిపారు.

ప్రియాంకగాంధీతో కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ, ఆ విషయాలపై చర్చ

'ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీతో దాదాపు 40 నిమిషాలు మాట్లాడడం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో చాలా విషయాలు చర్చించాం. రాష్ట్రంలో పార్టీలో తాజాగా నెలకొన్న పరిస్థితులపైనా చర్చించాం. కొత్తగా ఇద్దరు జాయింట్ సెక్రటరీలను ఇవ్వడం జరిగింది. మీరందరూ టీమ్​ వర్క్ చేయండని చెప్పారు. మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా నా దగ్గరికి రావొచ్చని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించాం. ఈ రోజు ఒక అర్థవంతమైన సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై మాట్లాడాం. కాంగ్రెస్‌ను పటిష్ఠం చేసేందుకు ప్రియాంక గాంధీ పలు సూచనలు చేశారు.'- కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ

ఇవీ చదవండి:

Last Updated : Aug 24, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.