ఏపీలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న పోలీసులకు, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని రవీంద్రపై అభియోగం దాఖలైంది. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇవాళ ఉదయమే రవీంద్ర ఇంటికి పోలీసులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు భారీ బందోబస్తు మోహరించారు.
అరెస్టుపై ఆగ్రహం
అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని.. కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇదేం న్యాయం అని అడిగినందుకు తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అరెస్టులకు భయపడేది లేదని.. న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.