ETV Bharat / city

'సన్నాల సాగుకు రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది'

సన్నరకం ధాన్యం సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఒత్తిడి చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. రకాలతో సంబంధం లేకుండా నాణ్యత ఆధారంగా ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సన్నరకం సాగుచేయాలని ప్రోత్సహించిన రాష్ట్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.

kishan reddy request to farmers don't sell the crops  Brokers
'సన్నాల సాగుకు రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది'
author img

By

Published : Nov 12, 2020, 5:29 PM IST

రాష్ట్రంలో ఎక్కువగా సన్నరకం ధాన్యం సాగు చేయాలని ప్రభుత్వం రైతులపై ఒత్తిడి చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. మార్కెటింగ్‌శాఖ, మార్క్‌ఫెడ్, నాఫెడ్, ఎఫ్‌సీఐ అధికారులతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి హైదరాబాద్​లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లపై పలు సంస్థల అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై ఆరా తీశారు. ప్రభుత్వ నిర్ణయంతో నేడు పంట అమ్ముడుపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కిషన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిల్లర్లేమో సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు.

దళారులకు విక్రయించాల్సిన పనిలేదు..

రైతులు సీసీఐ కేంద్రాలకు తేమలేని పత్తిని తీసుకెళ్లాలి. చివరి క్వింటా వరకు కొనుగోలు చేయాలని సీసీఐకి కేంద్రం చెప్పింది. నగదును ఆధార్‌ ఆధారంగా నేరుగా రైతుల ఖాతాలోనే సీసీఐ జమచేస్తుంది. రైతులెవరూ తమ పంటలను దళారులకు విక్రయించాల్సిన పనిలేదు. సీసీఐ కేంద్రాలకు రైతులందరూ ఒకేసారి వెళ్లకూడదు. ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరిపాం. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ధాన్యానికి దేశమంతా ఒకే ధర ఉంటుంది. రకాలతో సంబంధం లేకుండా నాణ్యత ఆధారంగా ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేస్తుంది. సన్నరకం సాగుచేయాలని ప్రోత్సహించిన రాష్ట్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. - కిషన్​రెడ్డి, కేంద్ర హోం శాఖ సహామ మంత్రి.

ఇవీ చూడండి: ఉద్రిక్తతకు దారితీసిన కరీంనగర్​ కలెక్టరేట్ ముట్టడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.