తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏలాంటి మేలు జరగలేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ శాఖ చెబుతున్నట్టు విత్తనాలు రైతులకు అందుబాటులో లేవని విమర్శించారు. రైతుబంధు తప్పితే... రైతులకు తెరాస ప్రభుత్వం చేసిన మేలు ఏముందని ప్రశ్నించారు.
సన్నరకం వరి ధాన్యం సాగు చేయమని చెప్పి... ఇప్పుడు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని ద్వజమెత్తారు. దీంతో సన్నాలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు అన్నీ కూడా రైతుకు ప్రయోజనం చేకూర్చేవిగా ఉండాలని కోరారు.
ఇదీ చూడండి: 'రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది'