ఏపీలోని విశాఖ కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్ పైనుంచి దూకబోయిన కొవిడ్ బాధితురాలిని..వైద్య సిబ్బంది రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని గమనించిన సిబ్బంది.. తక్షణమే స్పందించి కాపాడారు. కొద్దిరోజులుగా ఆమె కుటుంబానికి దూరంగా ఉండటంతో...ఇంటికి తరలించాలని వైద్యులను కోరింది. ఆమె కోలుకోకపోవటంతో వైద్యులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతున్న గది కిటికీ వద్దకు వెళ్లి దూకేందుకు సిద్ధపడింది. సమీపంలో ఉన్న మరో కొవిడ్ బాధితుడు గమనించి కేకలు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను అడ్డుకున్నారు.
ఇప్పటికే ఈ బ్లాక్‌లో నలుగురు బాధితులు మేడ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది వెల్లడి చేయలేదు. సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో విషయం తెలిసింది.