ETV Bharat / city

జాతీయ పార్టీకి కేసీఆర్​ కార్యచరణ.. తెరాస పేరు మార్పుపై త్వరలో తీర్మానం - New national party BRS

New national party BRS: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌.. దేశ రాజకీయాలపై దృష్టిసారించగా తొలుత కొత్త జాతీయ పార్టీకి భారత్‌ రాష్ట్రీయ సమితి అనే పేరు పెట్టాలని భావించారు. తాజాగా ఆయన ‘భారత్‌ రాజ్య సమితి’అనే పేరును కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. భారతదేశంలోని రాష్ట్రాల సమాఖ్య లేదా కూటమి అనే అర్థం వచ్చేలా ఉండడంతో దీనిపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.

new national party BRS soon
new national party BRS soon
author img

By

Published : Jun 12, 2022, 5:35 AM IST

Updated : Jun 12, 2022, 5:43 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితే.. భారత్‌ రాష్ట్రీయ సమితి లేదా భారత్‌ రాజ్య సమితి (భారాస) పేరిట జాతీయ పార్టీగా రూపాంతరం చెందనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న కారు గుర్తును యథాతథంగా జాతీయపార్టీలోనూ కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ జెండా, గుర్తులను గులాబీ రంగులోనే ఉంచి...తెలంగాణ చిత్రపటం స్థానంలో భారతదేశ పటాన్ని చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన కార్యాచరణను శనివారం ప్రారంభించారు. తొలుత కొత్త జాతీయ పార్టీకి భారత్‌ రాష్ట్రీయ సమితి అనే పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ భావించారు.

తాజాగా ఆయన ‘భారత్‌ రాజ్య సమితి’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. భారతదేశంలోని రాష్ట్రాల సమాఖ్య లేదా కూటమి అనే అర్థం వచ్చేలా ఉండడంతో దీనిపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీ పేరు మార్పుపై ఈ నెల 19న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు సమాచారం. పార్టీ పేరు మార్పుపై ఈ నెల 19న జరిగే తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు, 2,797 గుర్తింపు లేని పార్టీలు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌, భాజపా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, సీపీఐ, సీపీఎం, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), అఖిల భారత తృణమూల్‌ కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలు. వీటిల్లో ఎన్‌సీపీ, ఎన్‌పీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ప్రాంతీయ పార్టీలుగా ఉండి జాతీయ పార్టీలయ్యాయి. మిగిలిన పార్టీల పేరు మారలేదు కానీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పేరుకు ముంద]ు అఖిలభారత చేర్చి జాతీయ పార్టీగా తీర్మానం చేసి పంపగా...ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తెరాస తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పాటై ఉంది. దానికి జాతీయ స్థాయి రూపు రావడానికి భారత్‌ రాష్ట్రీయ సమితిగా పేరు మార్చాలని సీఎం భావిస్తున్నారు.

జాతీయ పార్టీ కావాలంటే... : జాతీయ పార్టీ కావాలంటే.. ప్రస్తుత నిబంధనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో రెండు శాతం సీట్లు గెలిచి ఉండాలి. లేదా సాధారణ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల్లో గానీ...శాసనసభ స్థానాల్లో గానీ ఆరుశాతం ఓట్లు పొంది ఉండాలి.

గుర్తింపు ఇలా.. : ఏ పార్టీ అయినా జాతీయ స్థాయి అని గానీ, రాష్ట్రస్థాయి అని గానీ ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవచ్చు. రాజకీయ పార్టీల సమాచారం ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. దాని ఆధారంగా హోదాలను ఎన్నికల సంఘం నిర్ధారిస్తుంది. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే దానికి ఎన్నికల గుర్తు రిజర్వ్‌ అవుతుంది. జాతీయ పార్టీకి మాత్రం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తు వస్తుంది.

తెరాసకు ఎలా... : తెరాస రాష్ట్ర పార్టీగా 22 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ పార్టీకి ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ఉన్నారు. గతంలో ఎన్‌సీపీ, ఎన్‌పీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు తమ పార్టీ తీర్మానాల ద్వారా జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం జాతీయ పార్టీ హోదా ప్రయత్నాల్లో ఉంది. తెరాస సైతం తాజాగా తమ పార్టీ తీర్మానాన్ని ఎన్నికల సంఘానికి పంపనుంది. ఆ పార్టీ పూర్వచరిత్ర ఆధారంగా దానికి హోదా ఇచ్చి, గుర్తును కేటాయించే వీలుంది.

ఇదీ చదవండి:

Last Updated : Jun 12, 2022, 5:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.