ETV Bharat / city

వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలి: సీఎం - కరోనా వైరస్

పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలు స్వీయ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ -19 వ్యాప్తిపై సీఎం అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా నిర్ధరణ అవుతున్న నేపథ్యంలో వారిపై ప్రత్యేకదృష్టి సారించింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాకపోకలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది.

kcr review on corona
వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలి: సీఎం
author img

By

Published : Mar 20, 2020, 5:48 AM IST

Updated : Mar 20, 2020, 7:17 AM IST

వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలి: సీఎం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం సుదీర్ఘంగా సాగింది. పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన కేసులతో పాటుగా స్క్రీనింగ్ పరీక్షలు, క్వారంటైన్‌, ఐసోలేషన్‌లో ఉన్న వారి వివరాలపై చర్చించారు. జిల్లాల్లో తాజా పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.

రాష్ట్రంలో 18 చెక్​పోస్టులు..

విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి విమానం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో వస్తున్న వారితోనే సమస్య తలెత్తుతోందన్నారు. కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా వ్యక్తుల ఉదంతమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 18 చెక్​పోస్టులను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్​ తెలిపారు.

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

సినిమా హాళ్లు, పబ్​లు, క్లబ్బుల మూసివేతను నెలాఖరు వరకు పొడిగించారు. పెళ్లి మండపాలను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా రద్దు చేశారు. షబ్బే మెరాజ్ సందర్భంగా కూడా సభలు నిర్వహించరాదని ముస్లిం సంఘాలకు తెలిపారు. ప్రజల స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అన్న సీఎం... వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

144 సెక్షన్‌పై భిన్నాభిప్రాయాలు..

రాష్ట్రంలో 144 సెక్షన్ విధింపు, రవాణా వ్యవస్థ నిలుపుదల లాంటి అంశాలపైనా సీఎం కేసీఆర్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తరచూ పరిశుభ్రం చేస్తూ.. ప్రజారవాణా వ్యవస్థను నడపాలని నిర్ణయించారు.

సాయంత్రం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్..

ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నిర్వహించనున్న దృశ్యమాధ్యమ సమీక్షలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సీఎం కేసీఆర్ ప్రస్తావించనున్నారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ సేవలను రాష్ట్రం ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.

ఇవీ చూడండి: నిత్యావసరాలపై ఆందోళన వద్దు.. ఒకేసారి కొనిపెట్టుకోకండి'

Last Updated : Mar 20, 2020, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.