రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణా ఇకపై ఖచ్చితంగా ఆర్టీసీ ద్వారానే జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం, సరకు రవాణా విభాగం పటిష్టంపై మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్, ఆర్టీసీ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
ఆర్టీసీ కార్గో,పార్సిల్ సేవల ద్వార రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలతో పటు ముంబయి, బీవండి, సోలాపూర్, జగ్దల్ పూర్ తదితర ప్రాంతాలకు కూడా సరకు రవాణా చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు కూర్పు, పనివిధానంను ఖరారు చేశారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున 202 మంది ఉద్యోగులతో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటవుతుందన్నారు. బోర్డు సమావేశాలు డిపో పరిధిలో వారానికోమారు, కార్పొరేషన్ పరిధిలో మూణ్నెళ్లకోమారు జరుగుతాయని పేర్కొన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పట్టించేందుకు ఈడీలు, ఉన్నతాధికారులు రాబోయే పదిరోజుల్లో డిపోల వారీగా సమావేశాలు నిర్వహించి అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీతో దేశానికే ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ