ETV Bharat / city

Shiv sena Mp on KCR: అందరినీ ఏకంచేసే సత్తా కేసీఆర్​కు ఉంది: శివసేన ఎంపీ రౌత్​ - Shiv sena Mp Sanjay Raut on bjp

Shiv sena Mp on KCR: దేశంలో భాజపాకు వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకం చేసే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్​కు ఉందని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ కితాబిచ్చారు. తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు త్వరలోనే ఇతర పార్టీల నేతలతో భేటీ అవుతారని రౌత్​ చెప్పారు.

Shiv sena Mp on KCR
Shiv sena Mp Sanjay Raut
author img

By

Published : Feb 21, 2022, 12:46 PM IST

Shiv sena Mp on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై శివసేన ఎంపీ సంజయ్​రౌత్​ ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్​ తన రాజకీయ జీవితంలో ఎంతో కష్టపడ్డారని.. ఎన్నో కష్టాలను ఓర్చి ఈస్థాయికి వచ్చారని కొనియాడారు. అన్ని రాజకీయ పక్షాలకు ఒక్కటి చేసే సత్తా కేసీఆర్​కు ఉందని రౌత్​ ప్రశంసించారు.

నిన్న సీఎం కేసీఆర్​.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​తో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక పక్షాలను ఏకం చేసే లక్ష్యంతో కీలక చర్చలు నిర్వహించారు. ఈ భేటీలో పాల్గొన్న అనంతరం సంజయ్​ రౌత్​ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్​, ఉద్ధవ్​ ఠాక్రే.. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు రౌత్​ చెప్పారు. ఇతర పార్టీల నేతలతో త్వరలోనే భేటీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్​ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని చెప్పారు.

సీఎం కేసీఆర్​ కష్టజీవి. రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. భాజపాకు వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకం చేసే సత్తా తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంది. యూపీ ఎన్నికల్లో భాజపా ఓడిపోతుంది.

- సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.