మేడారం జాతర దిగ్విజయంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో వ్యవహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా నిర్వహించారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నాయకత్వంలోని అన్ని శాఖల అధికారులు, డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు రేయింబవళ్లు పనిచేసి భక్తులకు సేవలు అందిచారని అభినందించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, జాతర నిర్వాహకులు, పూజారాలు, వనదేవతల వారసులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ట్రాఫిక్ సమస్యలు, క్యూలైన్ క్రమబద్ధీకరణలో పోలీసులు సమగ్ర వ్యూహంతో వ్యవహరించారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు