KCR Dasara Puja: దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన ముఖ్యమంత్రి పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు.

అనంతరం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీఎంవో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: