ETV Bharat / city

కాంగ్రెస్ పోరాటం వల్లే ధాన్యం కొనాలని కేసీఆర్ నిర్ణయం: రేవంత్‌రెడ్డి - Revanth Reddy latest news

Revanth Reddy on Paddy Procurement : యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్​ చేసిన ప్రకటనపై పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పోరాటాల ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చివరిగింజ కొనే వరకు నిఘా పెడతామని తెలిపారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Apr 12, 2022, 9:13 PM IST

Revanth Reddy on Paddy Procurement : యాసంగి దాన్యం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేసినా... చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్‌ నిఘా పెడుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో వడ్లు కొనుగోలుపై చేసిన ప్రకటనపై రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ నిరంతర పోరాటం సాగించినట్లు రేవంత్‌ రెడ్డి వివరించారు. రైతు సమస్యలపై తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఫలితమే ధాన్యం కొనడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయినా కేసీఆర్‌ మాటలను నమ్మడానికి వీలులేదన్న రేవంత్‌ రెడ్డి... తేడా వస్తే సంగతి తేలుస్తామని హెచ్చరించారు.

  • రైతుల పక్షాన కాంగ్రెస్ నిరంతర పోరాటం…

    రైతు సమస్యల పై తెలంగాణలో శ్రీ రాహుల్ గాంధీ సభ…
    ఫలితమే ధాన్యం కొనడానికి కేసీఆర్ నిర్ణయం.

    ఐనా, కేసీఆర్ ను నమ్మడానికి లేదు…
    చివరి గింజ కొనే వరకు నిఘా పెడతాం…
    తేడా వస్తే కేసీఆర్ సంగతి తేలుస్తాం…

    — Revanth Reddy (@revanth_anumula) April 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ధాన్యం మొత్తం కొంటాం: యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యం కొంటామని తెలిపారు. క్వింటాల్‌కు రూ.1960 చొప్పున ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు. రేపటి నుంచే యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి : యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.