ETV Bharat / city

creative ways to save money: వయసు 37 ఏళ్లు.. పొదుపు రూ.10 కోట్లు.. ఎలా సాధ్యమైందంటే? - తెలంగాణ వార్తలు

పొదుపు చేయాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. కానీ అందరికీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. ఉద్యోగంలో అప్పుడప్పుడే నిలదొక్కుకునే వయసులోనే ఏకంగా రూ.10కోట్లను పొదుపు చేసింది ఓ మహిళ. ఆమే... 37 ఏళ్ల కెటీ డొనేగన్‌. ఆమె పొదుపు రహస్యాలు(creative ways to save money) ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

creative ways to save money, savings secrets
పొదుపు రహస్యాలు, టిప్స్ ఫర్ సేవింగ్స్
author img

By

Published : Oct 6, 2021, 7:41 AM IST

37 ఏళ్ల కెటీ డొనేగన్‌ పొదుపు గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ ఉద్యోగంలో ఒక స్థాయికి చేరే వయసులో తను రిటైరవ్వడమే కాదు... రూ.10 కోట్లు పొదుపు చేసి(creative ways to save money) వార్తల్లోకెక్కింది. అదెలా సాధ్యమైందో కూడా సామాజిక మాధ్యమాల్లో(social media) చెబుతోంది. ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్న కెటీ పొదుపు రహస్యాలను(creative ways to save money) తెలుసుకుందాం.

చదువుకునేటప్పుడు అమ్మానాన్న ఇచ్చిన పాకెట్‌ మనీని తోబుట్టువుల్లా కెటీ ఖర్చు పెట్టేది కాదు. చిన్నప్పటి నుంచి ప్రతి పైసాను పొదుపు చేసేది. అలా దాచిన నగదుతో ఏదైనా చిన్నవ్యాపారం మొదలు పెట్టాలని పాఠశాల స్థాయి నుంచే ఆలోచించేది. అదే ఆమెను కోస్టారికాకు వెళ్లేలా చేసింది. అక్కడ తన జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటనే అలాన్‌ని కలవడం అంటుంది కెటీ.

జీవితభాగస్వామితో కేటీ

‘అనుకోకుండా ఏర్పడిన మా పరిచయం ప్రేమగా మారి జీవితాన్ని పంచుకునేలా చేసింది. పొదుపులో మా ఆలోచనలు ఒకటిగా ఉండటమే దీనికి కారణం. అలా ఒంటరిగా వెళ్లి జంటగా లండన్‌కు 2013లో తిరిగొచ్చా. ఆ తర్వాత లండన్‌ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేసి, ఓ జీవితబీమా సంస్థలో ఏడాదికి రూ.28 లక్షల జీతానికి చేరా. అలాన్‌ సొంత వ్యాపారం చేసేవాడు. సొంత ఇల్లు కోసం నగదు కూడబెట్టడం మొదలు పెట్టాం. దీనికోసం ఇద్దరం చాలా పొదుపుగా ఉండేవాళ్లం. ప్యాక్డ్‌ లంచ్‌ తినేవాళ్లం. ఎక్కువ ఖర్చయ్యే రాత్రి పార్టీలకు స్వస్తి పలికాం.'

-కెటీ డొనేగన్‌

'మా అవసరానికి సెకండ్‌ హ్యాండ్‌ కారునే కొన్నాం. నెలకు రూ.3లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేయాలనే లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. అలా మాకంటూ చిన్న ఇల్లు కొనుక్కున్నాం. మా కారు, ఇంటిని చూసి చాలామంది విమర్శించేవారు. అవేవీ పట్టించుకునే వాళ్లం కాదు. ఉద్యోగంలో చాలా కష్టపడే దాన్ని. దాంతో ఏడాదికే నా జీతం రెట్టింపయ్యింది. దాంతోపాటు మేమిద్దరం స్టాక్‌ మార్కెట్‌ గురించి అధ్యయనం చేసేవాళ్లం. క్రమేపీ అందులో కొంత నగదును వెచ్చించాం. సరైన నిర్ణయాలు తీసుకునే వాళ్లం. చిన్నచిన్న సంస్థలకు ఇన్వెస్టర్లుగా మారాం. ఏటా వీటి నుంచి రూ.65 లక్షలు ఆదాయం వస్తుంది. దీంతోపాటు ఆర్థిక సూత్రాల గురించి పాఠాలు చెప్పడానికి ఆన్‌లైన్‌లో రెబెల్‌ ఫైనాన్స్‌ స్కూల్‌ ప్రారంభించా. పదివారాల ఈ కోర్సులో ఆర్థికపరమైన జాగ్రత్తలు, ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు, పొదుపుపై పాఠాలుంటాయి. రెండేళ్లక్రితమే ఉద్యోగవిరమణ చేసి, సొంతంగా స్కూల్‌ నిర్వహణతోపాటు కౌన్సెలింగ్‌ చేస్తున్నా. మా లక్ష్యం రూ.10 కోట్లు పొదుపు చేయాలని. దాన్ని చేరుకున్నాం’ అని చెబుతున్న కెటీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది కదూ.

ఇదీ చదవండి: engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.