ETV Bharat / city

ktr: మహిళకు న్యాయం చేయాలని కేటీఆర్‌కు కర్ణాటక నేత విజ్ఞప్తి - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక కాంగ్రెస్‌ నేత డి.కె.శివకుమార్‌ ట్వీట్​ చేశారు. మాండ్యాకు చెందిన శశికళ అనే మహిళ భర్త హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మృతిచెందారని.. ఈ ఘటనపై స్పందించాలని కోరారు.

ktr
కేటీఆర్‌కు కర్ణాటక నేత విజ్ఞప్తి
author img

By

Published : May 30, 2021, 11:38 PM IST

కర్ణాటకలోని మాండ్యాకు చెందిన మహిళ కుటుంబానికి సాయమందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక కాంగ్రెస్‌ నేత డి.కె.శివకుమార్‌ విజ్ఞప్తి చేశారు. మాండ్యాకు చెందిన శశికళ అనే మహిళ భర్త హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మృతిచెందారని, ఆసుపత్రి యాజమాన్యం రూ.7.5 లక్షల బిల్లు వేసినట్లు ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. రూ.2 లక్షలు చెల్లిస్తామన్నా మృతదేహాన్ని అప్పగించలేదని తెలిపారు.

శివకుమార్‌ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాధితురాలి వివరాలు తెలియజేయాల్సిందిగా శివకుమార్‌ను కోరారు. మహిళ, ఆసుపత్రి బిల్లు వివరాలు తెలుసుకోవాలని తన సిబ్బందిని కేటీఆర్‌ ఆదేశించారు.

ఇవీ చూడండి: Medical Colleges: రాష్ట్రంలో మ‌రో 7 మెడిక‌ల్ కాలేజీలు: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.