ETV Bharat / city

'నేను ఎవర్నీ దత్తత తీసుకోలేదు.. కలెక్టర్‌కు అంతా చెప్పాను' - కరాటే కల్యాణిపై కేసు అప్‌డేట్స్

Karate Kalyani Latest News : చిన్నారి దత్తత వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కల్యాణి ఇవాళ హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ను కలిశారు. తనకు కలెక్టర్‌ నుంచి గానీ, సీడబ్ల్యూసీ అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. జిల్లా పాలనాధికారికి దత్తత విషయంలో వివరించి స్పష్టత ఇచ్చానని అన్నారు. సీడబ్ల్యూసీ అధికారులు లేకపోవడం వల్ల మళ్లీ బుధవారం రోజున విచారణకు రావాలని చెప్పారని వెల్లడించారు.

Karate Kalyani Latest News
Karate Kalyani Latest News
author img

By

Published : May 17, 2022, 5:52 PM IST

Updated : May 17, 2022, 10:53 PM IST

నేను ఎవర్నీ దత్తత తీసుకోలేదు.. కలెక్టర్‌కు అంతా చెప్పాను

Karate Kalyani Latest News : హైదరాబాద్‌ నాంపల్లిలోని కలెక్టర్ కార్యాలయానికి సినీనటి కరాటే కల్యాణి విచారణకు హాజరయ్యారు. మొదటగా జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరకు వెళ్లిన అమె... అనంతరం సీడబ్ల్యూసీ కార్యాలయంలోకి వెళ్లారు. కరాటే కల్యాణితో పాటు చిన్నారి తల్లిదండ్రులను కూడా అధికారులు విచారించారు.

సినిమా వాళ్లకి చిన్నారిని అమ్ముకున్నాననే వార్తల్లో వాస్తవం లేదని కరాటే కల్యాణి తెలిపారు. తాను అన్యాయాన్ని సహించనని... చాలా మందిని ప్రశిస్తున్నందునే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఐదు నెలల చిన్నారిని దత్తత తీసుకోలేదని స్పష్టం చేశారు. తనకు కలెక్టర్ నుంచి గానీ, సీడబ్ల్యూసీ అధికారుల నుంచి గానీ ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. దత్తత వ్యవహారంపై కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చానని చెప్పారు. ఈరోజు సీడబ్ల్యూసీ అధికారులు లేకపోవడంతో బుధవారం రోజున మళ్లీ విచారణకు పిలిచారని వెల్లడించారు.

"Karate Kalyani Issue News : నేను ఐదు నెలల చిన్నారిని దత్తత తీసుకోలేదు. దత్తత తీసుకున్నానని యూట్యూబ్‌ ఛానెల్‌లో చెప్పింది నిజమే. అలా చెబితే ఎవరైనా స్ఫూర్తి పొందుతారని చెప్పాను. దత్తత వ్యవహారంపై కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చాను. నాకు కలెక్టర్ నుంచి కానీ, సీడబ్ల్యూసీ అధికారుల నుంచి కానీ ఎలాంటి నోటీసులు రాలేదు. నేనే స్వచ్ఛందంగా అధికారుల వద్దకు వెళ్లి క్లారిటీ ఇచ్చాను. నేనెలాంటి తప్పు చేయలేదు. కొందరు కావాలనే నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను పాపను దత్తత తీసుకున్నట్లు శివశక్తి సంస్థ కావాలనే ప్రచారం చేస్తోంది. దానికి అధికార పార్టీ నేతలు కూడా మద్దతిస్తూ నాపై కక్ష సాధిస్తున్నారు. ఇవాళ సీడబ్ల్యూసీ అధికారులు లేకపోవడం వల్ల మళ్లీ రేపు విచారణకు రమ్మన్నారు. నేను దత్తత తీసుకోలేదు. ఇది నిజం. ఇంతటితో సమస్య పూర్తి కావాలి." - కరాటే కల్యాణి, సినీనటి

Last Updated : May 17, 2022, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.