వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మధ్య ట్వీట్ల పోరు నడుస్తోంది. తెదేపాకు దూరంగా ఉండాలని అధిష్టానం చెబుతున్నా కన్నా పట్టించుకోవటం లేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అమరావతి విషయంలో అందుకే గవర్నర్ కు లేఖ రాశారా అని ప్రశ్నించారు.
దానికి కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్లో ఘాటుగా బదులిచ్చారు. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్ 'పేరుతో వైకాపా నేతలు పుస్తకం విడుదల చేశారు కదా... మీరు అధికారం చేపట్టిన తర్వాత వారి అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కన్నా ప్రశ్నించారు.
గతంలోనూ కన్నా అవినీతికి పాల్పడుతున్నారని మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్లీ ట్వట్టర్ ద్వారా కన్నాపై విమర్శలు గుప్పించారు.
-
కన్నా లక్ష్మీనారయణ చంద్రబాబు కోవర్టు అని మళ్ళీ స్పష్టమైంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాసారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు.
ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగు కన్నా?
">కన్నా లక్ష్మీనారయణ చంద్రబాబు కోవర్టు అని మళ్ళీ స్పష్టమైంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2020
సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాసారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు.
ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగు కన్నా?కన్నా లక్ష్మీనారయణ చంద్రబాబు కోవర్టు అని మళ్ళీ స్పష్టమైంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2020
సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాసారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు.
ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగు కన్నా?
ఇదీ చదవండి: 'దిశ చట్టం... ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి?'