ETV Bharat / city

వేసవిలోనూ కళ కళ: సజీవ జల వారధి గోదావరి

కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తోంది. తడారుతున్న గొంతుల దాహార్తిని తీరుస్తోంది. ఇప్పుడు వర్షాకాలంలోనే కాదు ఎండాకాలంలోనూ కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లిస్తున్నారు.

Kaleshwaram water is diverted summer also
సజీవ జల వారధి గోదారి
author img

By

Published : Apr 29, 2020, 7:06 AM IST

Updated : Apr 29, 2020, 7:12 AM IST

జనవరి తర్వాత కొన్ని నదుల్లో నామమాత్రంగా నీటి ప్రవాహం ఉంటుంది. కొన్నింటిలో అసలుండదు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రధాన గోదావరిలో నీరు లేకపోయినా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదుల నుంచి వచ్చే నీరు ధవళేశ్వరం వద్దకు వెళ్లేది. ఆ నీటిని గోదావరి డెల్టా రబీ చివరి అవసరాలకు వాడుకొనేవారు. తాజాగా ప్రాణహితలో వచ్చిన నీటిని కాళేశ్వరం ద్వారా మళ్లిస్తున్నారు. అయినా ధవళేశ్వరం వద్ద ఎలాంటి మార్పులేకపోవడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్‌లో ఇక్కడ 15.78 టీఎంసీల నీరుండగా..ఈ నెలలో ఇప్పటివరకు 17.43 టీఎంసీల నీరు ఉంది.

వచ్చిన నీరు వచ్చినట్లు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన లిప్టు ద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌లో సుమారు ఎనిమిది టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లికి మళ్లించారు. వచ్చే ప్రవాహాన్ని నిల్వ చేసి నీటిమట్టం పెరగ్గానే ఒక పంపు నడపడం ద్వారా రోజుకు 0.25 టీఎంసీ చొప్పున తరలించారు. నీటి ప్రవాహం పెరిగినపుడు రెండో మోటార్‌ను కూడా కొన్ని గంటలపాటు నడిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఒక పంపు నడిపితే 2,100 క్యూసెక్కుల నీటిని మళ్లించడానికి అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నీటిమట్టం 93.5 మీటర్ల నుంచి 93.8 మీటర్ల వరకు ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రవాహం తగ్గినపుడు ఒక రోజు ఆపి మళ్లీ తరలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.గత ఏడాది మేడిగడ్డ ప్రారంభించినప్పటి నుంచి 60 టీఎంసీలకు పైగా ఎత్తిపోసినట్లు సమాచారం. దిగువన ఉన్న అన్నారం( సరస్వతి పంపుహౌస్‌) నుంచి మూడు దఫాలుగా 55 టీఎంసీలను సుందిళ్ల బ్యారేజీకి ఎత్తిపోశారు.

ఫిబ్రవరి 15 నుంచి ఈ నెల 25 వరకు 22 టీఎంసీలను తరలించారు. దీనిని బట్టి వచ్చిన నీటిని వచ్చినట్లుగా మళ్లిస్తున్నట్లు స్పష్టమవుతుంది. సుందిళ్ల (పార్వతి పంపుహౌస్‌) నుంచి 52.5 టీఎంసీల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయగా, ఇందులో ఫిబ్రవరి 17 నుంచి ఇప్పటివరకు తరలించింది 22.5 టీఎంసీలు. వేసవిలో ఎల్లంపల్లికి వచ్చిన నీటిలో కొంత మధ్యమానేరుకు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు, ఎన్‌టీపీసీ‡కి వినియోగించారు. గోదావరి బేసిన్‌లో వేసవిలో కూడా కనీస నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Last Updated : Apr 29, 2020, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.