ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడి వలకు.. మంగళవారం 28 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలకు దక్కించుకున్నారు. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద