ETV Bharat / city

KA Paul Offer to Munugode Youth : మునుగోడు యువతకు కేఏ పాల్ బంపర్ ఆఫర్ - KA Paul bumper Offer to Munugode Youth

KA Paul bumper Offer to Munugode Youth : ఎప్పుడూ ఏదో ఒక విధంగా తన మాటలతో సంచలనం సృష్టించే కేఏ పాల్​ ఇప్పుడు అదే రీతిలో తన మార్క్​ను చూపించారు. రాష్ట్రంలో త్వరలో మునుగోడు ఉపఎన్నిక రానున్న వేళ అక్కడి యువ ఓటర్లను ఆకర్షించేందుకు పాల్ వారికి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన 59వ పుట్టినరోజు సందర్భంగా 59 మంది యువతీయువకులకు పాల్ ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఇంతకీ అదేంటంటే..?

Prajashanti Party President KA Pal
KA Paul bumper Offer to Munugode Youth
author img

By

Published : Sep 20, 2022, 12:31 PM IST

మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్​ బంపర్​ ఆఫర్​

KA Paul bumper Offer to Munugode Youth: రాష్ట్రంలోని మునుగోడు నియోజకవర్గం నిరుద్యోగ యువతీయువకులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. తన 59వ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని 59మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్‌పోర్ట్‌, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు. కేసీఆర్‌, మోదీ యువతను మోసం చేస్తున్నారని పాల్ విమర్శించారు. నిరుద్యోగుల కష్టాలు తనకే తెలుసునని పేర్కొన్నారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న అవకాశాన్ని మునుగోడు యువత ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

"మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 58వేల మంది నిరుద్యోగులకు ఒక మంచి సదావకాశం కల్పిస్తున్నాను. నా 59వ జన్మదినం సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగికి లాటరీ తీసి వారిలో 59మందిని ఎంపిక చేసి వారిని అమెరికా పంపిస్తాను. వారికి అమెరికన్​ వీసా ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను. 175 గ్రామాల నుంచి నిరుద్యోగులు వస్తే ఒక్కొక్క గ్రామం నుంచి ఒకరు చొప్పున తీసుకుంటాను. అందరు నిరుద్యోగులు తమ రెజ్యూమ్​లను ఆదివారం అనగా ఈ నెల 25న శ్రీవారి హోమ్స్​ గ్రౌండ్​ తీసుకొని వస్తారని భావిస్తున్నాను. ఈ అవకాశం సాయంత్రం 3నుంచి 5గంటల మధ్య మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి." - కేఏపాల్‌, అధ్యక్షుడు ప్రజాశాంతి పార్టీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.