ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి జూనియర్‌, రెసిడెంట్‌ డాక్టర్ల సమ్మె - తెలంగాణ తాజా వార్తలు

doctors strike in telangana
తెలంగాణలో వైద్యుల సమ్మె
author img

By

Published : May 25, 2021, 7:15 PM IST

Updated : May 26, 2021, 1:33 AM IST

19:11 May 25

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి జూనియర్‌, రెసిడెంట్‌ డాక్టర్ల సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే విధుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న జూడాలు, రెసిడెంట్ వైద్యులు.. నేటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.  బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ అత్యవసర, ఐసీయూల్లో విధులు మినహా ఇతర వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. గురువారం నుంచి కరోనా అత్యవసర సేవలు సైతం బహిష్కరిస్తామని తెలిపారు.   

జూనియర్ రెసిడెంట్​, సీనియర్ రెసిడెంట్​లకు ప్రకటించిన 15 శాతం వేతన పెంపు అమలు, 10 శాతం కొవిడ్ సేవల ఇన్సెంటివ్​లు చెల్లించడం, కరోనా బారిన పడిన ఆరోగ్య సిబ్బందికి నిమ్స్​లోనే చికిత్స అందించడం, గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కొవిడ్​తో మృతిచెందిన వైద్యులకు రూ.50 లక్షలు, ఆరోగ్య కార్యకర్తల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని సమ్మె నోటీస్​లో పేర్కొన్నారు.  

ఈనెల 10న తమ డిమాండ్లతో కూడిన నోటీస్​ను డీఎంఈకి అందించిన జూడాలు.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాని కారణంగా రేపటి నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.  

ఇవీచూడండి: ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి

Last Updated : May 26, 2021, 1:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.