న్యాయశాఖలో వివిధ ఖాళీల భర్తీ కోసం నవంబరు 4 నుంచి 7 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఇవాళ్టి నుంచి హైకోర్టు అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో స్టెనో, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ తదితర సుమారు 1539 ఉద్యోగాల భర్తీ కోసం జులై 31న నోటిఫికేషన్ జారీచేసిన హైకోర్టు.. అంతర్జాలంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.
ఇవీచూడండి: డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం