హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని.. సంజయ్ గాంధీ నగర్‌లోని సంతోష్‌రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని కుటుంబంతో కలసి సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లారు. దొంగలు ఇదే అదునుగా భావించి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో దాచిన బంగారం ఎత్తుకుపోయారు.
ఇంటి యజమాని సంతోష్ రెడ్డి.. ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ల్యాప్‌టాప్, వెండివస్తువులు ఉన్నా వాటి జోలికి పోకుండా.. కేవలం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.