ETV Bharat / city

'టీటా'కు వర్క్​ స్పేస్ కోసం కలెక్టర్లకు జయేశ్​ రంజన్ లేఖ - కలెక్టర్లకు జయేష్ రంజన్ లేఖ

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్​కు కలెక్టరేట్లు, జిల్లా కేంద్రాల్లో స్పేస్ కేటాయించాలని కోరుతూ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్​ కలెక్టర్లకు లేఖలు రాశారు. టీటాకు వర్క్ స్పేస్ ఇవ్వడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజ‌లు సాంకేతికత ఫ‌లాలను మ‌రింత అందిపుచ్చుకుంటారని పేర్కొన్నారు.

'టీటా'కు వర్క్​ స్పేస్ కోసం కలెక్టర్లకు జయేశ్​ రంజన్ లేఖ

author img

By

Published : Feb 21, 2021, 8:33 PM IST

సాంకేతిక‌ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవ‌సాయం, క‌ళాకారుల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న... తెలంగాణ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా)కు క‌లెక్టరేట్లు, జిల్లా కేంద్రాల్లో వ‌ర్కింగ్ స్పేస్ కేటాయించాల‌ని కోరుతూ ఐటీ శాఖ ముఖ్య కార్యద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ క‌లెక్టర్లకు లేఖ రాశారు. అన్ని జిల్లా కేంద్రాల‌్లో వర్క్ స్పేస్‌లు కేటాయించాలని లేఖ‌లో ఆదేశించారు. టీటాకు వర్క్ స్పేస్ ఇవ్వడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజ‌లు సాంకేతికత ఫ‌లాలను మ‌రింత అందిపుచ్చుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లేఖ ప‌ట్ల సంతోషం వ్యక్తం చేసిన టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల ప్రభుత్వానికి, అధికారుల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఫ‌లితంగా త‌మ సేవా కార్యక్రమాలు మ‌రింత విస్తరించేందుకు అవ‌కాశం దొరుకుతుంద‌ని సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ఐటీ ప‌రిశ్రమ త‌ర‌ఫున గళం వినిపించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్​ను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో స్టార్టప్​లు ఏర్పాటు చేసేందుకు టీటా స‌మ‌న్వయం చేసేందుకు ఈ వ‌ర్క్ స్పేస్ ఉప‌యోగప‌డుతుంద‌ని సందీప్ మక్తాల పేర్కొన్నారు. టీటా చేస్తున్న అనేక కార్యక్రమాల‌ను గుర్తించి ఈ అవ‌కాశం క‌ల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్, ఉన్నతాధికారుల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. 30 దేశాల్లో విస్తరించిన టీటా చాప్టర్ల యొక్క స‌భ్యులు, తెలంగాణ‌లోని టెక్కీ అండ‌తో ఈ వ‌ర్క్ స్పేస్ ద్వారా క్షేత్రస్థాయిలో త‌మ కార్యక్రమాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నున్నవెల్లడించారు. సంబంధింత అధికారులు +91 8123123434 నంబ‌రులో త‌న‌ను సంప్రదించ‌వ‌చ్చున‌ని సూచించారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా సురభి వాణీదేవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.