ETV Bharat / city

Jawad cyclone in AP: జవాద్​ ఎఫెక్ట్.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవులు - jawad in ap

Jawad cyclone in AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా (జవాద్) మారింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

Jawad cyclone in AP
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న కలెక్టర్ సూర్య కుమారి
author img

By

Published : Dec 3, 2021, 6:56 PM IST

Jawad cyclone in AP: జవాద్ తుపాను నేపథ్యంలో ఏపీలోని విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మెంటాడ మండలం ఆండ్ర రిజర్వాయర్​ను పరిశీలించి.. డ్యాం భద్రతకు చేపట్టిన చర్యలు, రిజర్వాయర్​లో ప్రస్తుత నీటి నిల్వ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. ఒక గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి.. రిజర్వాయర్​ నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సుగుణాకర రావు కలెక్టర్​కు వివరించారు.

సహాయక బృందాలు సిద్ధం
Alert on jawad cyclone: తుపాను ముప్పు పొంచి ఉన్నందున జిల్లా ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్య, ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశమున్న గ్రామాల్లో ముందుగానే నాలుగు రోజులకు అవసరమైన రేషన్ సరుకులు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. గాలులు ఉద్ధృతంగా వీచే అవకాశం ఉన్నందున.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ వెల్లడించారు.

పాఠశాలలకు సెలవులు
effect on schools: తుపాను హెచ్చరికలతో జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలు, అంగన్​వాడీలకు కలెక్టర్‌ సూర్యకుమారి సెలవులు ప్రకటించారు. తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారిగా కాంతిలాల్‌ దండేను నియమించారు.

టార్పాలిన్లు అవసరమున్న వారికి ఏర్పాటు చేస్తున్నాం. మండలస్థాయిలో పర్యవేక్షణ జరుగుతోంది. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో గులాబ్ తుపాను ప్రభావం దృష్ట్యా ఈసారి అన్ని ప్రాంతాల్లో వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచాం. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశాం. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరుతున్నాం. తుపాను నుంచి ఆ దేవుడు కాపాడాలని కోరుకుంటున్నా. - సూర్య కుమారి, విజయనగరం జిల్లా కలెక్టర్

తుపానుగా మారిన వాయుగుండం..
Jawad cyclone effect: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు 420, ఒడిశాలోని గోపాల్​పూర్​కు 530 కిలోమీటర్ల దూరంలో 'జవాద్​' తుపాను కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం వైపునకు కదులుతోందని పేర్కొంది. రేపు ఉదయానికి ఉత్తకోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని.. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుందని తెలిపింది.

తీరానికి వచ్చేకొద్దీ దిశ మార్చుకుని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరకోస్తా తీరంలో 80-90 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పలుచోట్ల 20 సెం.మీ.కి పైగా వర్షపాతం, 3.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశముందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.