రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని జనసేన తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ డిమాండ్ చేశారు. పోసానిపై ఫిర్యాదు ఇచ్చి మూడ్రోజులైనా పోలీసులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. పోసాని వ్యాఖ్యల వెనక వైకాపా కుట్ర ఉందని ఆరోపించారు. పోసాని ఇంటిపై దాడితో జనసేనకు సంబంధం లేదన్న శంకర్.. ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే...
చలన చిత్ర పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోసాని(disputes bet ween Pavan kalyan posani) స్పందించారు. పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేశారు. పూర్తి కథనం కోసం.. క్లిక్ చేయండి.
పోసాని విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయన వ్యక్తిగత ఫోన్‌కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. పవన్ అభిమానుల మాటలు తన కుటుంబపరువు తీసేలా ఉన్నాయని.... అభిమానులను పవన్ నియంత్రణలో పెట్టుకోవాలంటూ... తర్వాతి రోజున హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పోసాని ఘాటుగా స్పందించారు.
మీడియాతో మాట్లాడి తిరిగి వెళ్తున్న క్రమంలో పోసానిపై పలువురు పవన్ అభిమానులు దాడికి (Pawan fans attempt to attack on Posani) యత్నించారు. అక్కడే ఉన్న పంజాగుట్ట పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోసానిని సురక్షితంగా పోలీసు వాహనంలో ఆయన నివాసానికి తరలించారు. పూర్తి కథనం కోసం.. క్లిక్ చేయండి.
అనంతరం పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు... పలు పోలీస్ స్టేషన్లో పోసానిపై ఫిర్యాదులు చేశారు. పోసాని చేసిన వ్యాఖ్యలు పవన్ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులు చేశారు. మరోవైపు.. పోసాని కూడా పవన్‌పై, ఆయన అభిమానులపై పోలీసులను ఆశ్రయిస్తానని ప్రకటించారు.
బుధవారం అర్ధరాత్రి పోసాని ఇంటిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి(attack on posani house) చేశారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ ఠాణా పరిధి ఎల్లారెడ్డిగూడెంలోని ఆయన ఇంటిపై దాడి(unknown persons attack on posani home)కి తెగబడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషిస్తూ.. ఇంటి గేటుపై ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఇంటి వాచ్మెన్ తెలిపాడు. పూర్తి కథనం కోసం.. క్లిక్ చేయండి.
సంబంధిత కథనాలు..