ETV Bharat / city

వైకాపా నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే మా లక్ష్యం: పవన్​కల్యాణ్​ - వైకాపా నేతల భూకబ్జాలు

PAWAN FIRES ON YSRCP: రాజకీయాల్లో క్రిమినల్స్​ ఉండకూడదనేదే తన ఆశయమని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ అన్నారు. వైకాపా నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విముక్తి చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖలో తనను రెచ్చగొట్టి.. గొడవ జరిగేలా చేయాలని చూశారని.. కానీ సంయమనంతో వ్యవహరించానన్నారు.

pawan comments ysrcp government
pawan comments ysrcp government
author img

By

Published : Oct 17, 2022, 9:26 PM IST

వైకాపా నుంచి.. రాష్ట్రాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యం: పవన్​కల్యాణ్​

PAWAN COMMENTS ON YSRCP: ఏపీలోని విశాఖలో తనను రెచ్చగొట్టి.. గొడవ జరిగేలా చేయాలని చూశారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్​ అన్నారు. విశాఖ నుంచి విజయవాడ చేరుకున్న అనంతరం.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పవన్​.. తనను ఎంత రెచ్చగొట్టినా సంయమనంతో వ్యవహరించానన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు క్రిమినల్స్‌కు సెల్యూట్‌ చేసే వ్యవస్థ ఉండడం దారుణమన్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్​ ఉండకూడదనేది తన ఆశయమన్న పవన్​.. వైకాపా నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విముక్తి చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైకాపా విముక్తి కోసం వచ్చే ఎన్నికల్లో పోరాడతామని తెలిపారు.

రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదనేదే వైకాపా ఉద్దేశమని పవన్​ అన్నారు. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే మేం జనవాణి ప్రకటించామనడం సరికాదన్నారు. వైకాపా కార్యక్రమానికి ఇబ్బంది కలిగించాలనడం మా ఉద్దేశం కాదని తెలిపారు. ఇతర పార్టీలను భయపెట్టి అదుపులో ఉంచాలనుకోవడం.. వైకాపా వ్యూహమని పవన్​ విమర్శించారు.

అధికార పార్టీ గర్జించడమేంటి: పార్టీ సంస్థాగత నిర్మాణం కోసమే పర్యటనలు చేస్తున్నామన్న పవన్​.. అధికార పార్టీ గర్జించడమేంటని ప్రశ్నించారు. మంత్రుల కార్లపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏమయ్యారన్నారు. విమానాశ్రయంలో కోడికత్తి ఘటనపై ఇప్పటికీ చర్యలు లేవన్నారు. వైకాపా శ్రేణులు దాడులు చేస్తున్నా పోలీసు కేసులు ఉండవని.. వాళ్లు దాడులు చేస్తే.. భావ ప్రకటన స్వేచ్ఛ అని డీజీపీ సమర్థిస్తుంటారని జనసేనాని అన్నారు.

వైకాపా నేతల భూకబ్జాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే విశాఖలో జనవాణి కార్యక్రమం జరగనీయలేదన్నారు పవన్​కల్యాణ్​. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దస్​పల్లా భూములు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయన్నారు. ఉత్తరాంధ్ర మీద వైకాపా పెద్దలకు ప్రేమ ఉంటే.. మాజీ సైనికులకు చెందిన 71 ఎకరాల భూములు ఎందుకు ఆక్రమిస్తారు ? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు రాయలసీమ నుంచే ఎక్కువ ముఖ్యమంత్రులు వచ్చినా.. ఆ ప్రాంతం ఎందుకు వెనకబడి ఉందన్నారు. అధికారమంతా ఒక కుటుంబం చేతిలో పెట్టుకుని అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు పవన్​కల్యాణ్​.

ఇక్కడే ఉండి పోరాటం చేస్తా: రాష్ట్రంలో జనసేన నేతలపై అక్రమ కేసుల విషయంలో పోలీసుల వ్యవహార శైలిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచన లేదన్నారు పవన్ కల్యాణ్. ఇక్కడ యుద్ధం మీరే చేయాలనేది భాజపా పెద్దల మనస్తత్వమనే విషయం తనకు తెలుసన్నారు. అందుకే తాను ఇక్కడే ఉండి తేల్చుకుంటానని.. ఏపీలో ఉండే పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తెలుగు నేలను కాపాడుకునేందుకు.. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ స్థాపనకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.