జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో జరిగే మత్స్యకార మహాసభకు ఆయన హాజరు కానున్నారు. ఇందుకోసం పవన్ ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నరసాపురం వెళ్లి.. మధ్యాహ్నం జరిగే సభలో పాల్గొంటారు.
మరోవైపు పవన్ రాక దృష్ట్యా.. పార్టీ నేతలు సభకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ భారీ బహిరంగ సభను గతంలోనే నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసినా.. కొవిడ్ కారణంగా చివరి నిమిషంలో ఆగిపోయింది.
ఇదీ చదవండి: ముగిసిన మేడారం మహాజాతర... వనప్రవేశం చేసిన వనదేవతలు