ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నుంచి యోగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు యార్లగడ్డ గీతా శ్రీకాంత్. నీటిపై తేలియాడుతూ యోగాసనాలు వేయడంలో తనకు తానే సాటి. ధృడమైన పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించివచ్చనే మాటాలే స్ఫూర్తిగా... ఆమె అడుగు ముందుకేశారు. యోగాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఓ రిసార్ట్స్ ఈత కొలనులో ఆమె ప్రదర్శించిన వివిధ ఆసనాలు అందర్నీ అబ్బురపరిచాయి. గతంలోనూ జలప్లవనస, వృక్షాసన, తాడాసన, పవన ముద్రాసన వంటి వివిధ రకాల ఆసనాలను ప్రదర్శించి యోగా గురువులను మెప్పించింది గీతా శ్రీకాంత్.
'శరీరం, శ్వాస, మనసు జతకలిపేదే యోగా. నీటిలో యోగ చేయడంతో ఒత్తిడి పూర్తి స్థాయిలో దూరమవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయండి. కొవిడ్ పరిస్థితుల్లో యోగాతో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు'
- యార్లగడ్డ గీతా శ్రీకాంత్
ఇదీ చదవండి: యోగా డే: నివాసాల్లోనే ఆసనాలేసిన ప్రముఖులు