కృష్ణ జలాల విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని వైకాపా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదంపై ఆయన స్పందించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు జలాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.
కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యనించారు. జలాల విషయంలో ఏపీకి నష్టం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఎంపీ పేర్కొన్నారు.
పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తాం
అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 18 వార్డు శివారులోని జగనన్న కాలనీలో పలు ఇళ్ల నిర్మాణాలకు, 13వ వార్డులో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు.
ఇదీ చదవండి: