ETV Bharat / city

Jagan Cases:పెట్టుబడుల సేకరణలో వారిద్దరిదే కీలకపాత్ర: సీబీఐ - తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

ముడుపుల రూపంలో పెట్టుబడుల సేకరణలో జగన్, విజయసాయి కీలక పాత్ర పోషించారని హైకోర్టుకు సీబీఐ వివరించింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన సీబీఐ.. తండ్రి అధికారంతో లబ్ధి చేకూర్చి వారి నుంచి ముడుపులకు కుట్ర చేశారని తెలిపింది.

AP CM jagan
హైకోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
author img

By

Published : Nov 8, 2021, 10:45 PM IST

రాష్ట్ర హైకోర్టులో ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపించింది. పెట్టుబడుల రూపంలో ముడుపుల వసూళ్లకు జగన్ కుట్ర చేశారని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. తండ్రి అధికారంతో లబ్ధి చేకూర్చి.. వారి నుంచి ముడుపులకు కుట్ర చేశారంది.

ముడుపుల రూపంలో పెట్టుబడుల సేకరణలో ఏపీ సీఎం జగన్, విజయసాయి కీలక పాత్ర పోషించారని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. జగతి పబ్లికేషన్స్‌లో రూ.1246 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. రూపాయి పెట్టకుండానే జగన్ రూ.1246 కోట్ల పెట్టుబడులు రాబట్టారని తెలిపింది. భూకేటాయింపులు, పెట్టుబడులను కలిపి చూస్తే కుట్ర కోణం తెలుస్తుందని.., భూకేటాయింపుల ఫైలు కదిలిక మేరకు పెట్టుబడులు వెళ్లాయని కోర్టుకు తెలియజేసింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయని వెల్లడించింది. వాదనలు విన్న న్యాయస్థానం శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై హైకోర్టు రోజువారీ విచారణలో భాగంగా.. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇవాళ హెటిరో, ఆ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపారు. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపించారు.

‘‘జగన్‌ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పలువురికి లబ్ధి చేకూర్చి వారి నుంచి ముడుపులను రాబట్టేందుకు విజయసాయిరెడ్డి, జగన్‌ కుట్ర పన్నారు. పెట్టుబడుల రూపంలో ముడుపులను సేకరించేందుకు పక్కా పథకాన్ని రూపొందించారు. జగతి పబ్లికేషన్స్‌లో జగన్ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ. 1,246 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టారు. జగన్‌కు చెందిన కార్మెల్ ఏసియా, సండూప్ పవర్ రూ.73 కోట్లు పెట్టినప్పటికీ.. అవి కూడా ఇతరులు పెట్టిన సొమ్మే. భూకేటాయింపులు, పెట్టుబడులు వేర్వేరు అని హెటిరో చేస్తున్న వాదన తప్పు. ఆ రెండింటిని కలిపి చూస్తేనే కుట్ర బయట పడుతుంది. ప్రజాప్రయోజనం, ఉపాధి కల్పన, అభివృద్ధి కోసమే అయితే నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? భూకేటాయింపులకు సంబంధించిన దస్త్రాలు పరిశీలిస్తున్న క్రమంలో పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్‌లోకి మళ్లినట్లు గుర్తించాం. హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయి. ఆయనపై కేసును కొట్టివేయొద్దు. సీబీఐ కోర్టులో కేసు డిశ్చార్జ్ పిటిషన్ దశలో ఉంది. పూర్తి స్థాయి విచారణ జరిగినప్పుడు అన్ని ఆధారాలతో రుజువు చేస్తాం’’- హైకోర్టులో సీబీఐ

ఇదీ చదవండి

Chandrababu: అభ్యర్థుల జాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.