అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. షరతులు ఉల్లంఘించినందున.. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో రఘురామకృష్ణరాజు కోరారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో ఆదేశించింది.
అయితే కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఈనెల 7న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు. ఈనెల 17న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. పదేపదే గడువు కోరడంపై రఘురామ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపిన న్యాయస్థానం.. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... పరీక్షల రద్దు కోరుతూ సీజేఐకి విద్యార్థుల లేఖ