ఇవాళ, రేపు.. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అధికారులను అప్రమత్తం చేసింది.
జల దిగ్భంధంలోనే లంక గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంతోపాటు కోనసీమ లంక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. జిల్లాలోని 26 మండలాల పరిధిలోని 180 గ్రామాలు వరదకు ప్రభావితమయ్యాయని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని 82 గ్రామాల్లోకి వరద నీరు చేరిందన్నారు. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందగా.... మరో ఇద్దరు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు.
జిల్లాలో 129 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సుమారు 57 వేల 607మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షాలకు 2వేల 008 హెక్టార్లలో వరి, 10వేల 624 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని.... ఎటపాక డివిజన్‌లో 8 పంచాయతీల రహదారులు దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో సహాయక చర్యల్లో 45 క్లస్టర్ బృందాలు,14 మొబైల్ బృందాలతోపాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి: