ETV Bharat / city

ప్రైవేటు సంస్థపై ఐటీ దాడులు.. రూ. 161 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

author img

By

Published : Feb 18, 2021, 9:32 PM IST

గత నెల 28న ఓ ప్రైవేటు సంస్థపై చేసిన దాడుల్లో రూ. 17.68 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. సినిమా ఫైనాన్సింగ్, పంపిణీ, రొయ్యల పెంపకం, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీ నగదు లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించామన్నారు. 2016-20 మధ్య పన్ను పరిధిలో జరగాల్సిన రూ. 161 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు తేలిందని చెప్పారు.

it-attacks-on-eluru-centric-private-organization-and-huge-level-illegal-transactions-identi
ప్రైవేటు సంస్థపై ఐటీ దాడులు.. రూ. 161 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు సంస్థపై దాడులు చేసినట్లు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గత నెల 28న.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థకు చెందిన పలు కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. సినిమా ఫైనాన్సింగ్​తో పాటు పంపిణీ, రొయ్యల పెంపకం, రియల్‌ ఎస్టేట్‌, వివిధ నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. 2016-17 నుంచి 2019-20 మధ్య రూ. 161 కోట్ల లావాదేవీలు జరగ్గా.. వీటిలో అధిక మొత్తం పన్ను పరిధిలో జరగాల్సినవే ఉన్నాయని స్పష్టం చేశారు.

లెక్కల్లోకి రాకుండా జాగ్రత్తలు...

ఈ సోదాల్లో చేతిరాతతో ఉన్న పలు అకౌంట్‌ పుస్తకాలు, నగదు లావాదేవీల వివరాలు, ఒప్పందాలు, ఖాళీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపి వడ్డీలు వసూలు చేస్తూ.. ఇవేవీ లెక్కల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. సుమారు రూ. 13 కోట్లకు సంబంధించిన వివరాలను క్లౌడ్‌ నుంచి తొలిగించగా.. ఆ సమాచారాన్ని రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.

నగదు రూపంలోనే లావాదేవీలు...

సినిమాలు పంపిణీ చేయడంతోపాటు వివిధ ప్రాంతాల్లో థియేటర్లు నడుపుతూ.. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని దాచి ఉంచారని ఐటీ అధికారులు తెలిపారు. అనేక ప్లాట్లు అమ్ముతూ.. మొత్తం రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు నగదు రూపంలోనే నడిపారని పేర్కొన్నారు. ఏలూరు, రాజమహేంద్రవరంలో జరిగిన సోదాల్లో రూ. 14.26 కోట్ల నగదు, రూ. 3.42 కోట్ల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: ప్రతిభను నమ్మారు.. కోటీశ్వరులయ్యారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.