ETV Bharat / city

పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ ప్రయోగం సక్సెస్ - మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో..

భారతదేశ సత్తాను ఇస్రో మరోసారి ప్రపంచానికి చాటింది. 2021లో చేపట్టిన తన తొలి ప్రయోగం విజయవంతమైంది. తన 78వ ప్రయోగమైన పీఎస్​ఎల్వీ సీ -51 నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది.

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో..

author img

By

Published : Feb 28, 2021, 10:44 AM IST

Updated : Feb 28, 2021, 10:54 AM IST

భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రో.. మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో తన విజయ పరంపరను మరోమారు కొనసాగించింది.. ఈ ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్​ఎల్వీ సీ-51 విజయవంతమైంది. 10.24 నిమిషాలకు.. రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో..

ఇస్రో నుంచి మొదటిసారిగా నేడు దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను నింగిలోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్​కు చెందిన అమోజోనియా-1, మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూపర్యవేక్షణకు ఈ ఉపగ్రహం కీలకం కానుంది. శ్రీహరికోటలోని షార్​ నుంచి జరిగిన ఈ ప్రయోగాన్ని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ ప్రత్యక్షంగా వీక్షించారు.

బ్రెజిల్ బృందానికి అభినందనలు, ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో తొలిప్రయోగం చాలా గర్వంగా ఉంది: శివన్‌, ఇస్రో చీఫ్

ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి మోదీ పేరు, ఫొటో, ఆత్మనిర్భర్ మిషన్ పేరుతో పాటు.. భగవద్గీత కాపీ, 25,000 మంది పేర్లను ఇస్రో పంపింది. ఇందులో వెయ్యిమంది విదేశీయుల పేర్లు కాగా.. మిగిలిన 24 వేల పేర్లు చెన్నై విద్యార్థులవి కావడం విశేషం.

Last Updated : Feb 28, 2021, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.