ETV Bharat / city

GSLV: 'నిరుత్సాహం వద్దు.. మళ్లీ విజయం సాధిస్తాం'

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 ప్రయోగం సాంకేతిక సమస్యవల్ల విఫలమవ్వడంపై మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు మాట్లాడారు. రానున్న కాలంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మెరుగైన విజయాలు నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

isro
జీఎస్ఎల్వీ
author img

By

Published : Aug 12, 2021, 6:00 PM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10) ప్రయోగం విఫలమైందని బాధపడాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలమని ఇస్రో మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు అన్నారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహక నౌక ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా క్రయోజనిక్ దశలో రాకెట్ సమస్య తలెత్తిందని.. అందుకే వాహకనౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లిందని ఆయన విశ్లేషించారు.

మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తి ప్రయోగం విఫలమైందని వివరించారు. గత ఏడాది మార్చిలోనే ఈ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినా.. సాంకేతిక సమస్యతో నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు. తాజా ఫలితానికి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

GSLV: 'నిరుత్సాహం వద్దు.. మళ్లీ విజయం సాధిస్తాం'

ఇదీ చూడండి: ETELA RAJENDER: ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు నాదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.