ETV Bharat / city

వెయ్యి కారణాలు... లక్ష ఆటంకాలు.. అయినా సాధించగలం.. - happy women's day

మనల్ని వెనక్కిలాగడానికి వెయ్యి కారణాలు... లక్ష ఆటంకాలు ఉండొచ్చు! ఇలాంటి ఎన్నో సవాళ్లనీ, అవరోధాల్నీ అధిగమించి ముందుకు వెళ్తున్నవారే కదా మనకి స్ఫూర్తి. వాళ్లు సాధించిన విజయాల నుంచీ ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకుందాం... అడుగు ముందుకేద్దాం!

International Women's Day success stories

author img

By

Published : Mar 8, 2022, 10:47 AM IST

కొవిడ్‌ తర్వాత ఆర్థికంగా కుదేలయిన కుటుంబాలకి పూర్వపు లక్ష్మీకళని తీసుకురావడంలో ఆడవాళ్లే చురుగ్గా ఉన్నారట. మహిళా దినోత్సవం సందర్భంగా స్కిప్‌బాక్స్‌ సంస్థ ఇందుకు సంబంధించి సర్వే నిర్వహించింది. దీన్లో...తమ కుటుంబాలు మళ్లీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రతి ఐదుగురిలో ఒక మహిళ కొత్తగా పెట్టుబడులవైపు ఆసక్తి చూపిస్తోందని తేలింది. ముఖ్యంగా 70 శాతం మహిళలు తమ డబ్బుని తామే సొంతంగా నిర్వహించుకోవాలనుకుంటున్నారట. ఇందులో సగం మంది డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లని వేదికగా చేసుకుంటే... చాలా తక్కువమంది మాత్రమే భర్తల సలహా తీసుకుంటున్నారు. పీపీఎఫ్‌, బంగారం వంటి సంప్రదాయ వాటితోపాటు మ్యూచువల్‌ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్యా పెరుగుతోంది.

ఐటీ నైపుణ్యాల్లో ఆసక్తి...
రానున్న కాలంలో మెటా(ఫేస్‌బుక్‌) తన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచాన్ని శాసించాలనుకుంటోంది. యూట్యూబ్‌ ఇప్పటికే ఎంతోమందికి చేరువయ్యింది. మెటా సీఓఓగా షెరిల్‌శాండ్‌బర్గ్‌, యూట్యూబ్‌ని సుసాన్‌ ఓజ్‌సికీ ముందుకు నడిపిస్తున్నారు. వీరి స్ఫూర్తిని అందుకుని ఎన్ని ఆటంకాలున్నా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టుసాధించాలనుకుంటున్నారు నేటి తరం అమ్మాయిలు. సాంకేతికత లోతులు తెలుసుకోవాలన్న కుతూహలం రోజురోజుకి అమ్మాయిల్లో పెరుగుతోందని బైట్‌ఎక్సెల్‌ అనే ఎడ్యుకేషనల్‌ సంస్థ సర్వేలో తేలింది. ఐటీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని... గూగుల్‌, మెటా వంటి సంస్థల్లో రాణించేందుకు వీలుగా క్లౌడ్‌కంప్యూటింగ్‌, ఐఓటీ, సైబర్‌ సెక్యూరిటీ, పైథాన్‌ లాంగ్వేజ్‌ వంటి వాటిని నేర్చుకోవడానికీ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని ఈ సర్వే చెబుతోంది.

కేరళ కలెక్టర్ల స్ఫూర్తి...
పాలిచ్చే అమ్మలకన్నా... పరిపాలన గురించి ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది? కేరళలో తాజాగా నియామకమైన కలెక్టరమ్మలని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. కేరళలోని పద్నాలుగు జిల్లాల్లో పది జిల్లాలకు మహిళలే కలెక్టర్లుగా ఉండటం దేశం మొత్తానికి స్ఫూర్తి కలిగించే విషయం. అంటే మూడింట రెండొంతుల కేరళ పరిపాలన మహిళల చేతుల్లోనే ఉంది. ఇదొక్కటే కాదు గత ఏడాది స్థానిక ఎన్నికల్లో పదకొండువేలమందికి పైగా మహిళలు అధికారాన్ని చేజిక్కించుకుని కీలకమైన మేయర్‌ పదవులనీ సొంతం చేసుకున్నారు. మరోవైపు సివిల్‌ సర్వీసుల్లోనూ అబ్బాయిలకంటే ఎక్కువగా దూసుకుపోతున్నారు.
* వ్యాపారం మగవాళ్ల సామ్రాజ్యం అనే అభిప్రాయానికి చెక్‌పెడుతున్నారు నేటితరం మహిళలు. గత ఏడాదిలో... 42 అంకుర సంస్థలు యూనికార్న్‌ స్థాయిని అందుకున్నాయి. రూ.7500 కోట్ల విలువైన సంస్థలని ఈ యూనీకార్న్‌క్లబ్‌లో చేరుస్తారు. ఈ 42 సంస్థల్లో 10 యూనికార్న్‌ వ్యాపారాలు మహిళలవే. వీళ్లలో నైకా స్థాపకురాలు ఫల్గునీనాయర్‌, దివ్యగోకుల్‌నాథ్‌ వంటివారు కొత్తతరం మహిళా వ్యాపారవేత్తలకి స్ఫూర్తినిస్తున్నారు. పదేళ్ల క్రితం వీరి వాటా దేశంలో 13 శాతం మాత్రమే. గూగుల్‌ బ్రెయిన్‌ రిపోర్ట్‌ ప్రకారం అక్కడ నుంచి మరో ఇరవై శాతం మహిళలు వ్యాపార రంగంలో పెరిగారని తేలింది. సమీప భవిష్యత్తులో వీరు 15కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తారని.. ఎడిల్‌గివ్‌ ఫౌండేషన్‌ దేశవ్యాప్తంగా చేసిన సర్వే తెలిపింది.
* ప్రపంచం మొత్తం మీద ఆరోగ్యరంగంలో 70 శాతంమంది మహిళలే ఉన్నారు. ఆశ్చర్యంగా ఉందా? ఈ విషయాన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే తెలిపింది. అందులో 25 శాతం మంది అతివలు ఉన్నత స్థానాల్లో ఉండి తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రపంచం మొత్తాన్ని వణికించిన కొవిడ్‌ నుంచి కోట్లాది మంది ప్రజలకు రక్షణగా నిలిచిందీ మహిళలే!

అరుంధతీ భట్టాచార్య

"స్త్రీలు ఉద్యోగం కంటే కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారనే ఆలోచనలు మీ పై అధికారుల్లో తప్పకుండా ఉంటాయి. కనుక మీకంటూ గుర్తింపు వచ్చేదాకా రెట్టింపు కష్టపడండి. కొందరు ఎదురుగా కొండచరియలున్నాయని భయపడతారు. అదే మన వృద్ధికి ఆటంకం. ధైర్యంగా సాగితే మార్గం కనిపిస్తుంది. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడ్డాకే, ఎలాంటి పరిస్థితినయినా చక్కబెట్టుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఇబ్బందుల్లో పడే ఆస్కారం ఉంది." - అరుంధతీ భట్టాచార్య, మాజీ ఛైర్‌పర్సన్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.