ETV Bharat / city

'తెలంగాణ పోలీసుశాఖలో 33శాతం మహిళలు ఉండటం గర్వకారణం' - అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్​ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ ఆడిటోరియంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ పోలీసు శాఖలో 33 శాతం మంది మహిళలు ఉండటం గర్వకారణమని సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

'తెలంగాణ పోలీసుశాఖలో 33 శాతం మహిళలు ఉండటం గర్వకారణం'

author img

By

Published : Mar 5, 2021, 7:15 PM IST

Updated : Mar 5, 2021, 7:50 PM IST

'తెలంగాణ పోలీసుశాఖలో 33 శాతం మహిళలు ఉండటం గర్వకారణం'

అన్ని రంగాల్లో మహిళలు సాధికారిత సాధించారని హైదరాబాద్​ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పోలీసు శాఖలో మహిళలకు ప్రాధాన్యత పెరిగిందని, పోలీసు నియామకం పోస్టుల్లో 33 శాతం సిబ్బంది మహిళలే ఉండడం గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ పోలసు కమిషనరేట్‌తో పాటు వివిధ పోలీసు కార్యాలయాలకు మహిళలే భద్రత కల్పిస్తున్నారని... దేశంలో ఎక్కడ ఈ తరహా విధానం లేదని ఆయన చెప్పారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో సమానంగా మహిళా సిబ్బంది భాగస్వాములుగా ఉన్నారన్నారు. కరోనా సమయంలో మహిళా సిబ్బంది కూడా విధులు నిర్వహించారని... వైరస్‌ బారిన పడినా వారు వెనకడుగు వేయలేదన్నారు. ప్రతి మహిళ సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నట్టు సీపీ తెలిపారు. భరోసా కేంద్రాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రశంసలందుకోవడాన్ని అంజనీకుమార్‌ ప్రశంసించారు.

బేగంపేట విమానాశ్రయంలోని ఆడిటోరియంలో పోలీసు విభాగం, షీ బృందాల పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిస్‌ ఎర్త్‌, బహుముఖ ప్రజ్ఞశాలి తేజస్విని మనోజ్ఞ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షీ బృందాలు మహిళల్లో భయాందోళనలు తొలగిస్తున్నారని తేజస్విని కొనియాడారు. మహిళల రక్షణ కోసం నగర పోలీసులు పని చేస్తున్నారని ప్రశంసించారు. మహిళలు దేనైనా సవాలుగా తీసుకుంటే ప్రపంచాన్నే మార్చవచ్చన్నారు. ప్రతినిత్యం మహిళలు దాడులు, వేధింపులు ఎదుర్కొంటునే ఉన్నారన్నారు. దేశంలో అత్యధిక శాతం యువత ఉన్నారని... సగం మంది సామాజిక మాధ్యమాలతోనే కాలక్షేపం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తేజస్విని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అంజనీకుమార్‌ సతీమణి, ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్‌ వసుంధరతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బీమా సొమ్ము కోసం 'చావు తెలివి తేటలు'

Last Updated : Mar 5, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.