ETV Bharat / city

విజయవాడ విమానాశ్రయానికి.. జూన్‌ 2 నుంచి విదేశీ సర్వీసులు

ఏపీలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు రానున్నాయి. జూన్‌ 2 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

international services to vijayawada airport
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ సర్వీసులు
author img

By

Published : May 31, 2021, 9:51 AM IST

కొవిడ్‌ నేపథ్యంలో చేపడుతోన్న ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా జూన్‌ 2 నుంచి ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రవాసాంధ్రులు అధికంగా ఉండే కువైట్‌, మస్కట్‌, సింగపూర్‌ల నుంచి తొలుత ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. ఆదివారం మినహా ఇతర రోజుల్లో నిత్యం ఒకటి, రెండు సర్వీసులు రాష్ట్రానికి చేరనున్నాయి.

ఇప్పటివరకు దిల్లీ మీదుగా ఈ సర్వీసులు ఉండేవని.. ఇప్పుడు ఆయా దేశాల నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ మధుసూదనరావు తెలిపారు. విజయవాడ నుంచి కూడా నేరుగా ఆయా దేశాలకు ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. జులై 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: CM KCR: వద్దనుకున్నా లాక్​డౌన్​ తప్పడం లేదు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.