ETV Bharat / city

విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు - Inter Board finalizing the academic year in Telangana

inter-board-finalizing-the-academic-year-in-telangana
విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు
author img

By

Published : Sep 10, 2020, 5:33 PM IST

Updated : Sep 10, 2020, 7:11 PM IST

17:29 September 10

విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు

కరోనా పరిస్థితులతో విద్యా సంవత్సరాన్ని 182రోజులకు కుదిస్తూ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ ఖరారు చేసింది. మార్చి 24నుంచి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఏప్రిల్ 17 నుంచి వేసవి సెలవులు ఇచ్చి జూన్‌ ఒకటిన తిరిగి కళాశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరాకు మూడు రోజులు, సంక్రాంతి రెండు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు.

తగ్గిన సెలవులు

కరోనా పరిస్థితులతో గందరగోళంగా మారిన విద్యా సంవత్సరాన్ని పునరుద్దరించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. సెలవులను భారీగా తగ్గిస్తూ విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. పని దినాలను తగ్గించిన అధికారులు ఈ విద్యా సంవత్సరంలో 220 రోజులకు బదులు 182రోజుల్లోనే సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించారు. దసరాకు ఆదివారంతో కలిసి మూడు రోజులే సెలవులు. సంక్రాంతికి రెండు రోజులేనని బోర్డు స్పష్టం చేసింది. 

 ఫిబ్రవరి 22 నుంచి 27వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు...మార్చి ఒకటి నుంచి మార్చి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలని వెల్లడించింది. మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు వార్షిక పరీక్షలు ఉంటాయని బోర్డు వివరించింది. ఏప్రిల్‌ 17నుంచి మే 13 వరకు వేసవి సెలవులుగా పేర్కొంది. మే చివరి  వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జూన్‌ ఒకటిన తిరిగి కళాశాలను ప్రారంభించనున్నట్లు బోర్డు వెల్లడించింది. కరోనా పరిస్థితులతో విద్యా సంవత్సరంలో 38 పని దినాలు తగ్గించింది.

ఇంటర్‌ క్యాలెండర్‌

విద్యాసంవత్సరం ప్రారంభం సెప్టెంబర్‌ 1
దసరా సెలవులు అక్టోబర్ 23-25
సంక్రాంతి సెలవులుజనవరి 13, 14
ప్రీఫైనల్‌ పరీక్షలు 2021 ఫిబ్రవరి 22-27
ప్రాక్టికల్‌ పరీక్షలు 2021 మార్చి 1-20
వార్షిక పరీక్షలు2021 మార్చి 24-ఏప్రిల్ 12
వేసవి సెలవులు ఏప్రిల్ 17- మే 31
అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ మే చివరి వారం

ఇదీ చదవండిః 'తక్కువ సమయం.. ఎక్కువ ప్రశ్నల ఛాయిస్​'

Last Updated : Sep 10, 2020, 7:11 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.