పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. స్పిల్ వేలోని రేడియల్ గేట్లకు మొదటి సిలిండర్ను జర్మనీ నిపుణులు అమర్చారు. జర్మనీ నుంచి హైడ్రాలిక్ సిలిండర్లను జలవనరుల శాఖ దిగుమతి చేసుకుంది.
ఒక్కో గేటుకు 2 హైడ్రాలిక్ సిలిండర్ల చొప్పున బిగింపునకు ప్రణాళిక తయారు చేశారు. 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లును అధికారులు అమర్చనున్నారు. 17.3 మీటర్ల పొడవైన ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ 20 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇవీచూడండి: వృక్షవేదం పుస్తకాన్ని చూసి సంతోషం కలిగింది: ఉపరాష్రపతి